బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఎమర్జెన్సీ. దివంగత భారతప్రధాని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో ఇందిరాగాంధీగా కంగనా నటిస్తుంది. జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం గతేడాది నవంబరు 24న విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల వలన విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత జూన్ 14న విడుదల చేయానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ క్రమంలోనే కంగనా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం హిమచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటి చేస్తుండడంతో ఈ సినిమా మళ్లీ వాయిదా పడింది తాజాగా ఇదే విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఎమర్జెన్సీ సినిమా విడుదలకు సంబంధించి కంగనా దూరంగా ఉంటున్నారు. అందువలన ఈ సినిమాను వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని త్వరలోనే తెలియచేస్తాం. మీ మద్దతుకు ధన్యవాదాలు అంటూ కంగనా టీమ్ వెల్లడించింది.