దేశంలో సీఏఏ అమలు చేసి తీరుతాం : ప్రధాని మోడీ

modi1-1.jpg

లోక్‌సభ ఎన్నికల వేళ పౌరసత్వ సవరణ చట్టం-2019 అమలు ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకున్నవారికి తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో సీఏఏపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరేం చేసినా దేశంలో సీఏఏ అమలుకాకుండా అడ్డుకోలేరన్నారు మోడీ తెలిపారు. దేశంలో సీఏఏ అమలు చేసి తీరుతామని..ఇది మోదీ గ్యారెంటీ అనిఅన్నారు. ఇప్పటికే కొందరికి దేశపౌరసత్వం అందించినట్టు తెలిపారు. మతం ఆధారిత విభజన ద్వారా నష్టపోయిన మన దేశ పౌరులను కాంగ్రెస్ పట్టించుకోలేదని మోదీ మండిపడ్డారు.

యూపీ రాష్ట్రం అజంఘర్ లో నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని మోడీ మాట్లాడుతూ… 60 సంవత్సరాల పాటు దేశంలో మతపరమైన విద్వేషాలు రగిలించారని, మోదీ ప్రభుత్వమే వాటికి చరమగీతం పాడిందని అన్నారు. రాబోయే ఎన్నికలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయని అన్నారు. బీజేపీని, ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రపంచమంతా ఆశీర్వదిస్తోందని ప్రధాని మోడీ తెలిపారు.కాగా, ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి

మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది.

Share this post

scroll to top