వెయిట్ లాస్‌కు ట్రై చేస్తున్నారా.. వెల్లుల్లి చక్కగా సహాయపడుతుంది.

Garliccc.jpg

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు కూడా ఒకటి. మారిన లైఫ్ స్టైల్ విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. వెయిట్ లాస్ అయ్యేందుకు వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేస్తున్నారు. ఎక్సర్ సైజ్ చేస్తూనే.. ఈ చిట్కా కూడా బరువు తగ్గేందుకు హెల్ప్ చేస్తుంది. వెల్లుల్లిలో ఎక్కువగా విటమిన్ సి, విటమిన్ బీ6, ఫైబర్, క్యాల్షియం, మాంగనీస్ వంటివి పుష్కలంగా ఉంటాయి.

వెల్లుల్లి తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. లోబీపీ, జలుబుతో బాధ పడేవారు వెల్లుల్లి తీసుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో గార్లిక్ హెల్ప్ చేస్తుంది.రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకుని.. ముక్కలుగా కట్ చేసి గ్లాస్ నీటిలో వేయాలి. ఆ నీళ్లను రాత్రంతా అలానే ఉంచాలి. ఉదయం వెల్లుల్లి ముక్కలను తీసేసి.. కొద్దిగా మిరియాల పొడి కలుపుకుని తాగితే.. క్రమంగా బరువు తగ్గుతారు.

Share this post

scroll to top