కేటీఆర్ చీర కట్టుకొని ఆ పని చేయు: సీఎం రేవంత్ రెడ్డి

revanth-.jpg

పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల పోలింగ్ కు కేవలం 6 రోజుల సమయం మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలో మేరుపు ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. జాతీయ నాయకులతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భారీ సభలను నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్మల్ లో భారీ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కాలేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు అమలు కాలేదంటున్న కేటీఆర్.. నువ్వు చీర కట్టుకుని ఆడపిల్లలా.. మంచిగా తయారై.. ఆర్టీసీ బస్సు.. ఎక్కు.. కండక్టర్ నిన్ను టికెట్ డబ్బులు అడిగితే ఆరు గ్యారంటీలు అమలు కాలేదని అప్పుడు ఒప్పుకుంటాము.. లేకుంటే తాము ఇచ్చిన హామీలు అమలు అయినట్లేనని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Share this post

scroll to top