151 MLA, 22MP లు దాటుతున్నాం : CM జగన్

cm-jaganwq.jpg

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి అధికారం చేపట్టబోతున్నామని సీఎం జగన్ అన్నారు. విజయవాడలోని ఐప్యాక్ కార్యాలయానికి వెళ్ళిన జగన్ అక్కడి ఉద్యోగులతో మాట్లాడారు. ఈ సందర్భంగా…. 2019లో వైసీపీ సాధించిన 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ స్థానాలకు మించి ఈసారి సాధించబోతోందని అన్నారు.

ఏపీ ఫలితాలు చూసి… దేశం మొత్తం షాక్ కాబోతుందని ఏపీ సీఎం వైస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేద్దామన్నారు ఏపీ సీఎం వైస్ జగన్. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని పేర్కొన్న జగన్…ఎక్కువ సీట్లే సాధించబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామని….ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిదని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు ఏపీ సీఎం వైస్ జగన్.

Share this post

scroll to top