మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా?

pemple.jpg

అందానికి మొటిమలు ఓ అడ్డు! మొహంపై మొటిమలు అయ్యాయింటే.. ముఖం వికారంగా మారిపోయిందని చాలామంది అమ్మాయిలు బాధపడుతుంటారు. వాటిని తగ్గించుకోవడానికి మార్కెట్‌లో రకరకాల క్రీములను వాడుతుంటారు. ఆ క్రీముల్లో కొన్ని మంచి ప్రభావం చూపించవచ్చు. కానీ కొన్నిసార్లు అవి మొటిమలను మరింత ఎక్కువ చేసే అవకాశం కూడా ఉంది. అందుకే మొటిమలకు క్రీములు వాడటానికి బదులు.. అసలు మొటిమలు ఎందుకు వస్తున్నాయో కారణాలను తెలుసుకుంటే వాటిని తగ్గించుకోవడం చాలా ఈజీ అని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.

జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజులో నాలుగైదుసార్లు చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఉదయం, సాయంత్రం రోజ్‌వాటర్‌తో ముఖం కడిగితే మొటిమల తీవ్రత తగ్గుతుంది.
నూనె పదార్థాలను అధికంగా తినడం వల్ల కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంది. అందుకే రెగ్యులర్‌ డైట్‌లో నూనె శాతం తగ్గించాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి.
డిప్రెషన్‌లో ఉన్నవారికి సైతం మొటిమలు వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. మానసికంగా సంతోషంగా ఉండాలి.
ఆహారం విషయంలో సమయపాలన పాటించకపోవడం వల్ల కాలేయంలో ఉత్పత్తి అయ్యే యాసిడ్లు మొటిమలకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే, సమయానికి తగు ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.

Share this post

scroll to top