ప్రశాంత్ కిషోర్ కు జగన్ స్ట్రాంగ్‌ కౌంటర్

prashant-vs-jagan.jpg

రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మాట మార్చాలని సీఎం జగన్ అన్నారు. ఈసారి వైసీపీకి అధికారం రాదని పీకే ఇటీవల చేసిన వ్యాఖ్యలపై జగన్ ఇలా స్పందించారు. దేశంలో అందరూ షాక్ అయ్యేలా జూన్ 4న ఫలితాలు వస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు.

అన్ని రాష్ట్రాల నేతలు ఏపీనే చూస్తారన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఐప్యాక్ ఎంతో సహాయపడిందని… ఐప్యాక్ సూచనలను గత ఐదేళ్ల పాలనలోనూ అమలు చేశామని చెప్పారు. వచ్చే ప్రభుత్వంలో ఈ ఐదేళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేద్దామన్నారు ఏపీ సీఎం వైస్ జగన్. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలానే కొనసాగుతుందని పేర్కొన్న జగన్…ఎక్కువ సీట్లే సాధించబోతున్నట్లు తెలిపారు. ప్రజలకు ఈ ఐదేళ్లకు మించిన గొప్ప పాలన అందిస్తామని….ఐ ప్యాక్ టీం చేసిన సేవలు వెలకట్టలేనిదని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.

Share this post

scroll to top