ఎపి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఆ ఘటనపై వైఎస్ భారతి స్పందించారు. ఈ నేపథ్యంలో జగన్‌పై దాడి డ్రామా అని ప్రతిపక్షాలు విమర్శించడం చాలా బాధాకరం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. డ్రామాలు ఆడాల్సిన అవసరం ఆయనకు లేదని… నిజంగా డ్రామాలు ఆడాలి అని అనుకుని ఉంటే.. దెబ్బ తగిలిన వెంటనే హాస్పిటల్‌కి వెళ్లి హంగామా చేసే వారు, కానీ జగన్ అలా చేయలేదు కదా అని మండిపడ్డారు. గతంలో జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగినప్పుడు కూడ ప్రతిపక్ష నేతలు ఇలానే అన్నారని, అప్పుడు కూడ ఆయన హాస్పిటల్‌కి వెళ్లి హంగామా చేయలేదని పేర్కొన్నారు.