ఎన్నికల ఎఫెక్ట్.. పెరిగిన బస్ ఛార్జీలు..!!

ap-and-ts-.jpg

2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ పోలింగ్ మే 13(సోమవారం) జరగనుంది. తెలంగాణతో పాటు, ఏపీలో కూడా ఎన్నికలు జరగనుండగా హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ఓటర్లతో పాటు.. తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు తిరుగు ప్రయాణమయ్యారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు భారీ ఎత్తున ప్రయాణికులు చేరుకున్నారు. దీంతో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికుల కోసం.. ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

అలాగే.. స్పెషల్ గా ఏర్పాటు చేసిన బస్సుల్లో 1.25% ఛార్జీలు కూడా పెంచినట్లు అధికారులు స్పష్టం చేశారు. వన్ సైడ్ ట్రాఫిక్ అధికంగా ఉండటంతో.. తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా వస్తున్నాయని ఈ కారణంగానే ఛార్జీలు పెంచినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో సాధారణంగా రూ. 220 ఉన్న టికెట్ ధర తాజా పెరుగుదలతో స్పెషల్ బస్సుల్లో రూ. 250 తీసుకుంటున్నట్లు ప్రయాణికులు తెలుపుతున్నారు. అలాగే పెంచిన టికెట్లను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు.

Share this post

scroll to top