ఏపీలో గత ఎన్నికల సమయంలో అమిత్ షా చేసిన ఆరోపణలకు చంద్రబాబు సమాధానం చెప్తారని ఆశిస్తున్నామని YCP ట్వీట్ చేసింది. చంద్రబాబు పనితీరును అమిత్ షా విమర్శించారు. ఆయన జాతీయవాదాన్ని ప్రశ్నించారు. CMగా అభివృద్ధి చేయలేదన్నారు. కాంగ్రెస్ తో అపవిత్ర పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్, వాజ్పేయీకి వెన్నుపోటు పొడిచారన్నారు. వీటన్నిటికీ బాబు తగిన సమాధానం చెప్పాలి అని రాసుకొచ్చింది.