ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్ అన్నారు. మూతపడిన సీసీఐ పరిశ్రమను తెరిపిస్తామని నిర్మల్ సభలో హామీ ఇచ్చారు. ఈనెల 9వ తేదీలోపు రైతుభరోసా నిధులను ఖాతాల్లో జమ చేస్తామని, ఆగస్టు 15వ తేదీలోపు ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు. ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే 5 అమలు చేశామన్నారు.