ఆంధ్రప్రదేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా హిందూపురం లోక్సభ పరిధిలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో కాసేపటి క్రితం ధర్మవరం చేరుకున్నారు. ఆయనకు కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. చంద్రబాబు, అమిత్ షా కలిసి ఒక వేదికపై కనిపించడం ఆరేళ్లలో ఇదే తొలిసారి. ఈ సందర్భంగా అమిత్ షాను చంద్రబాబు సత్కరించారు. ధర్మవరం నుంచి కూటమి తరఫున సత్య కుమార్ పోటీలో ఉన్నారు.