బాచుపల్లి ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

revanth1.jpg

బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు చనిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం.. తప్పిదం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.

Share this post

scroll to top