బీజేపీని నమ్మి ఓటేస్తే ఇక ఆగమేనని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పెట్రోల్ ధరలతో కాషాయ పార్టీ ఇప్పటికే సామాన్యుడి నడ్డి విరుస్తోంది. అబ్ కీ బార్.. చార్ సౌ పార్ అని నమ్మి ఓటేస్తే అంతే సంగతి. చార్ సౌ అనేది సీట్ల గురించి కాదు పెట్రోల్ రేట్ల గురించి అంటూ కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు. 2014లో రూ.70 ఉన్న లీటర్ పెట్రోల్ ధర ఇప్పుడు రూ. 110 అయిందని, 2029లో రూ.400 అవుతుందని విమర్శించారు.