ఏపీలో ఎన్నికల వేళ టీడీపీ నేతలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై అబద్దపు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పచ్చ మీడియా, చంద్రబాబుపు పై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..చంద్రబాబుకు బొమ్మ కనిపిస్తోంది. ఓటమిని ఏ శక్తీ ఆపలేదని అర్థమైంది. అందుకే అబద్ధాల వడగళ్లు కురిపించడానికి సిద్ధమయ్యాడు. అమలులోనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాడు. నార్త్ కొరియాలాంటి చోట ప్రభుత్వం భూములు లాక్కుంటుందేమో కానీ ప్రజాస్వామ్య దేశంలో ఒకరి పేరుతో ఉన్న భూమిని ప్రభుత్వం అక్రమంగా గుంజుకోవడం సాధ్యమా? అని ప్రశ్నించారు.