ప్రస్తుతం ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది. నువ్వా నేనా అనే విధంగా పోటా పోటిగా ప్రచారం చేస్తున్నారు నాయకులు. అంతే కాకుండా ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఏపీ ఎలక్షన్స్ ఎఫెక్ట్ చిత్ర పరిశ్రమపై కూడా పడిందనే చెప్పవచ్చు. చాలా మంది నటీనటులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు మద్దతు ఇస్తున్నారు. అంతే కాకుండా ఈసారి పవన్ అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయం అంటున్నారు పవన్ అభిమానులు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
వేణు స్వామి సెలబ్రిటీస్, రాజకీయ నాయకుల జాతకం చెప్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న విషయం అందరికీ తెలుసు. అయితే ఆయన తాజాగా ఏపీ రాజకీయాలపై ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌కు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదు. ఆయన తన జాతకం రీత్యా సీఎం కాలేడు. రాజకీయాల్లో పవన్ మోసపోవడం ఖాయం. చంద్రబాబు చేతిలో పవర్ స్టార్ మోసపోతాడు. అసలు వీరు కలిస్తే ఓటమి తప్పదు. గ్రహాల రీత్యా పవన్, చంద్రబాబు కలవకూడదు దీని వలన కూటమికి ముప్పే. రానున్న ఎన్నికల్లో వైసీపీనే విజయం సాధిస్తుంది. . జాతకరీత్యా చంద్రబాబునాయుడిది పుష్యమి నక్షత్రము, పవన్ కల్యాణ్ ది ఉత్తరాషాఢ నక్షత్రము, ఈ రెండింటికీ పొత్తు కుదరదన్నారు. వీళ్ల జాతకం ప్రకారం ఓటు బదిలీ కూడా జరగలేదు అంటూ తేల్చి చెప్పారు.