తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం హన్మకొండలోని భీమదేవరపల్లిలో బీఆర్ఎస్ MPఅభ్యర్థి వినోద్ కుమార్‌కు మద్దతుగా హరీష్ రావు ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలన చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చామని గుర్తుచేశారు. రైతుబంధు ద్వారా 11 విడతల్లో రూ.72 వేల కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు. ఆయన వెళ్లినచోటల్లా దేవుళ్లపై ప్రమాణాలు చేసి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. మోసం చేసిన కాంగ్రెస్‌కు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలని చెబుతుంటే.. కేసీఆర్‌ను దుర్బాషలాడుతున్నారని సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ అంటేనే కరువు అని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మోసపూరిత ప్రచారాలతో తెలంగాణ ప్రజల గుండెలు మండుతున్నాయని చెప్పారు. తరచూ ఐదు గ్యారంటీలు అమలు చేశామని చెబుతున్నారు.. ఐదు గ్యారంటీలు పూర్తిచేసినట్లు నిరూపించాలని సవాల్ చేశారు.