మీరు వాడుతోన్న నెయ్యి అసలా.? నకిలీనా.?

Ghee.jpg

మీరు కొనుగోలు చేసిన నెయ్యి స్వచ్ఛమైనదా కాదా అని తెలుసుకోవడానికి ఒక పాత్రలో నీటిని మరిగించాలి. అనంతరం అందులో రెండు చెంచాల నెయ్యిని వేయాలి. ఆ తర్వాత గ్యాస్‌ ఆఫ్‌ చేసిన ఆ పాత్రపై మూత పెట్టాలి 24 గంటలు అలా పక్కన పెట్టేయ్యాలి. ఒకరోజు తర్వాత కూడా నెయ్యి లేత పసుపు రంగులో ఉండి, గడ్డట్టకుండా ఉంటే అది స్వచ్ఛమైన నెయ్యి అని అర్థం చేసుకోవాలి.

ఒక పాత్రలో రెండు చెంచాల నెయ్యి వేసి వేడి చేయాలి. వేడిచేసిన తర్వాత నెయ్యి లేత గోధుమరంగులోకి మారుతుంది. వేడిచేసిన తర్వాత నెయ్యి రంగు ఇలా మారితే, నెయ్యి స్వచ్ఛమైనదని అర్థం. ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా నెయ్యి కలపండి. కాసేపటి తర్వాత నెయ్యి నీటిపై తేలితే అది స్వచ్ఛమైన నెయ్యి అవుతుంది. కానీ నెయ్యి కల్తీ అయితే గ్లాస్‌ చివరికి వెళ్లి పోతుంది.

ఒక గిన్నెలో ఒక చెంచా నెయ్యి తీసుకుని అందులో అర చెంచా ఉప్పు, కొద్దిగా హైడ్రోక్లోరిక్ యాసిడ్ కలపాలి. అరగంట అలాగే వదిలేయండి. నెయ్యి స్వచ్ఛంగా ఉంటే అరగంట తర్వాత రంగు మారదు. నెయ్యి కల్తీ అయితే అరగంట తర్వాత రంగు మారుతుంది.

Share this post

scroll to top