పిస్తాలో జియాక్సింతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. పిస్తా మన శరీరంలోని హానికరమైన క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారికి పిస్తాలు మంచి ఎంపిక. వీటిలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. మీ ఆహారంలో పిస్తాలను చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించవచ్చు. మీ ఆహారంలో వీటిని జోడించడం వల్ల రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది ,శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.
పిస్తాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. ఇది చర్మ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. పిస్తాపప్పులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటుకు మంచి మందు. ఇది రక్తపోటును గణనీయంగా తగ్గిస్తుంది, ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడుతున్న వ్యక్తులలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.