ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఈ తరుణంలో మనం మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలంటే, మనం రోజుని ఆరోగ్యకరమైన రీతిలో ప్రారంభించాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉదయాన్నే కరివేపాకును నమలడం మంచి పద్ధతి..
కరివేపాకును ఖాళీ కడుపుతో నమలడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఉదయం పూట ఏమీ తినకుండా తిన్నప్పుడు జీర్ణ ఎంజైమ్‌లు ఉత్తేజితమై ప్రేగు కదలికలను సులభతరం చేస్తాయి. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో మీకు సహాయపడుతుంది.
కరివేపాకు జుట్టు రాలడాన్ని నిరోధించడంలో మీకు సహాయపడుతుంది. ఉదయం పూట ముందుగా ఒక గ్లాసు నీరు తాగాలి. కొన్ని నిమిషాల తర్వాత, మీరు కొన్ని తాజా కరివేపాకులను నమలవచ్చు. ఆకులను సరిగ్గా నమలి తినండి.. అల్పాహారం తీసుకునే 30 నిమిషాల ముందు తింటే చాలా మంచిది..