మహాసేన రాజేష్ వ్యాఖ్యలు చేయడం వెనుక చంద్రబాబు, లోకేష్ పాత్ర – మంత్రి కారుమూరి

karumuri.jpg

పవన్ కళ్యాణ్ ను ఓడించాలని ఇపుడు అనేక మంది పిలుపు ఇస్తున్నారు..మహాసేన రాజేష్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ ను ఓడించాలని చెప్పడం వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కారుమూరి. 14 ఏళ్ళు పాలన చేసిన చంద్రబాబుకు తనకంటూ ఒక మార్క్ లేదని విమర్శలు చేశారు. ప్రజలు సంతోషంగా ఉండటం చంద్రబాబుకి ఇష్టం ఉండదు.

ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడు..చంద్రబాబు హేయమైన చర్యలకు పాల్పడుతున్నారు.. నిన్ను నమ్మం బాబు అని ప్రజలు మరొకసారి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సంక్షేమ పథకాలు అమలు కావల్సిన అవసరం ఉంది.. పథకాలు ఆపడానికి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేశాడు..ఈసీ నిర్ణయం ద్వంద వైకరిగా కనిపిస్తుందన్నారు. వృద్ధులకు అందాల్సిన పెన్షన్ విషయంలో ఇబ్బందులకు గురి చేశారని ఫైర్‌ అయ్యారు.

Share this post

scroll to top