ప్రధాని మోడీ పై మంత్రి సెటైర్లు..

modi.jpg

ప్రధాని మోడీ సోమవారం ఏపీలో పర్యటించాడు. కూటమి నేతల తరపున ఆయన రాజమండ్రి, అనకాపల్లి సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సీఎం జగన్ పాలనలో అవినీతి పెరిగిందని, అభివృద్ధి తగ్గిందని విమర్శించారు. రాష్ట్రంలో కచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

దిన్ని పై మంత్రి అమర్‌నాథ్ స్పందింస్తూ.. ప్రధాని మోడీ విమర్శలను ఖండించారు. ప్రధాని మోడీపై సెటైర్లు వేశారు. చంద్రబాబే యూటర్న్ అనుకుంటే ఇప్పుడు మోడీ కూడా అదే పని చేశారని ఎద్దేవా చేశారు. యూటర్న్ బాబు పక్కన చేరి యూటర్న్ మోడీ తమ ప్రభుత్వంపై విమర్శలు చేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టును ప్రధాని మోదీ చదివారన్నారు. రాజకీయ అవసరాల కోసం జగన్ పాలనపై విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, కేంద్రం నిధలుపై ప్రధాని మోడీ ఒక్క మాట కూడా ప్రస్తావించలేదని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు.

Share this post

scroll to top