పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నోరు జారిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు నిర్మల్ పోలీసులు అద్దంకి దయాకర్ పై ఐపీసీ సెక్షన్ 504, 505/2 కింద కేసు పెట్టినట్లు మీడియాకు వెల్లడించారు. ఈ నెల 5న ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అద్దంకి దయాకర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలను విమర్శిస్తూ శ్రీరాముడిపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ‘‘తెలంగాణలో బీజేపీ నేతలు, కార్యకర్తలు ‘మేం హిందువులం.. శ్రీరాముడి వారసులం’ అంటున్నారు. మీరు శ్రీరాముడి వారసులు ఎలా అయ్యారు? రాముడు మీ చిన్నాయనా, సీత మీ చిన్నమ్మనా’’ అని అన్నారు.