సీనియర్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముద్దుగుమ్మ తన నటనతో టాలీవుడ్‌లో నెంబర్ వన్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇప్పటికి తరగని అందంతో కట్టిపడేస్తూ పాన్ ఇండియా మూవీ ఆఫర్‌లు అందుకుంటుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం‘విశ్వంభర’ సినిమాలో పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవితో జత కట్టే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు త్రిష పుట్టినరోజు. త్రిష 41వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ బర్త్ డే విషెస్ తెలిపింది. దీనితో పాటు కొత్త పోస్టర్‌ను పంచుకుంది.
ఇక ఈ మూవీ సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీ తెరకెక్కుతుండగా యువీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ. 200 కోట్లతో బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.