నా జీవితాన్ని మార్చిన క్షణమిదే అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్..

Alluuuuuuuuuuuuuuuuuu-arjunnnnnnnnnnnnnnnnnnnnnnnnnn.jpg

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప-2’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఆగస్ట్ 15న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఇప్పటికే పుష్ప-2 నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. అయితే అల్లు అర్జున్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నాడు. ఈ క్రమంలో.. తాజాగా, బన్నీ ఆర్య సినిమాకు 20 ఏళ్లు పూర్తి కావడంతో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.

ఐకాన్ స్టార్, అను మెహతా కాంబోలో వచ్చిన సినిమా ఆర్య. దీనిని సుకుమార్ తెరకెక్కించగా.. 2004 మే 7న థియేటర్స్‌లో విడుదలై ప్రభంజనం సృష్టించింది. అంతేకాకుండా అందరినీ మెప్పించడం తో పాటు మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. కేవలం 30 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. అయితే నేటితో ఆర్య సినిమాకు 20 ఏళ్లు పూర్తి కావడంతో బన్నీ పోస్ట్ పెట్టాడు. ‘‘ఆర్యకు 20 ఏళ్లు. ఇది సినిమా మాత్రమే కాదు.. నా జీవితాన్ని మార్చేసిన క్షణమిదే. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. తీపి జ్ఞాపకాలు’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశాడు.

Share this post

scroll to top