హీరో బాలకృష్ణ, హీరోయిన్ కాజల్ కలిసి ‘భగవంత్ కేసరి’ మూవీలో నటించిన విషయం మన అందరికీ తెలిసినదే. ఈ సినిమా మంచి సందేశంతో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ తెచ్చుకుంది.
అయితే బాలకృష్ణ, కాజల్ కాంబోలో మళ్ళీ ఓ సినిమా చేయబోతున్నా్రని టాక్ నడుస్తుంది. ‘భగవంత్ కేసరి’తో భారీ విజయాన్ని అందుకున్న ఈ జంట, తాజాగా కేఎస్ రవీంద్ర(బాబి) దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమాలో కూడా కలిసి నటిస్తున్నారనే వార్త వినిపిస్తున్నది.
ఇందులో ఊర్వశీ రౌతేలా నటిస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించినా.. ఆమెది హీరోయిన్ పాత్ర కాదని, ఆమె పోలీస్‌ఆఫీసర్‌గా నటిస్తున్నదని ఫిల్మ్‌వర్గాలు చెబుతున్నాయి. మరి బాలయ్యకు జోడీగా నటించే హీరోయిన్ ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇందులో కాజల్ కూడా నటిస్తుండగా ఆమె హీరోయిన్ పాత్ర కాకుండా నెగిటీవ్ షేడ్స్ ఉండే పాత్ర చేస్తున్నదట. అది నిజమో కాదో తెలియాలంటే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే.