రామ్ చాలా కాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. థియేటర్ వరకూ వచ్చిన సినిమా, ఆయనకి దిగులునే మిగిల్చి వెళుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన పూరి దర్శకత్వంలో ‘డబుల్ ఇస్మార్ట్’ చేస్తున్నాడు. ఫస్టు పార్టు మాదిరిగా ఈ సినిమా కూడా తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందని ఆయన భావిస్తున్నాడు. ఆ తరువాత సినిమా ఎవరితో ఉండొచ్చుననేది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. త్రివిక్రమ్ ఒక కథను వినిపించడం, రామ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ .. రామ్ మార్క్ మాస్ యాక్షన్ ఉంటుందని అంటున్నారు. త్వరలోనే సెట్స్ పైకి ఈ సినిమా వెళ్లడం ఖాయమని చెబుతున్నారు. రామ్ జోడీగా భాగ్యశ్రీ బోర్సే సందడి చేసే అవకాశం ఉందని అంటున్నారు.