బాబు, లోకేష్‌కు కొడాలి నాని స్ట్రాంగ్‌ కౌంటర్‌

Kodali-nani.jpg

చంద్రబాబుకు కావాల్సింది అధికారమే.. అందుకోసం గాడిద కాళ్లైనా పట్టుకుంటాడని కొడాలి నాని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు. మంగళగిరిలో నారా లోకేష్‌ గెలిచే సీన్‌ లేదు అంటూ కొడాలి నాని కామెంట్స్‌ చేశారు.

గతంలో టీడీపీ చేసిందేమీ లేదు. ఇప్పుడు చేస్తామన్నా టీడీపీ ఎవరూ నమ్మడం లేదు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు అసెంబ్లీ టీడీపీ నేతలే మద్దతిచ్చారు. మంచి చట్టమని పయ్యావుల కేశవ్‌ చెప్పాడు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. రాష్ట్రంలో ఎప్పటి నుంచో కొనసాగుతున్న పథకాలకు డబ్బులు పడకుండా కూటమి అడ్డుకుంది. నిధుల కోసం ప్రభుత్వం కోర్టుకు వెళ్లి పోరాడాల్సిన పరిస్థితి తెచ్చాడు. చంద్రబాబు ఏం పోయేకాలమని వృద్ధులు, మహిళలు బూతులు తిట్టుకుంటున్నారు.

చంద్రబాబుకి మాడు పగిలేలా ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు. చంద్రబాబుకి ఇవే ఆఖరి ఎన్నికలు. పప్పు లోకేష్ మంగళగిరిలో కూడా గెలవడు. మతి భ్రమించి సీఎం గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. చంద్రబాబును ఈ రాష్ట్రం నుంచి సాగనంపడానికే ఈ ఎన్నికలు. చంద్రబాబుకి ప్రజలు చరమగీతం పాడటం ఖాయం’ అంటూ కామెంట్స్‌ చేశాడు.

Share this post

scroll to top