అక్షయ్ కుమార్ నుంచి ఎంతో నేర్చుకున్నానన్న మంచు విష్ణు

Manchu-.jpg

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం వంటి వారు నటిస్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా షూటింగ్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా అక్షయ్ కుమార్ పై సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఈ క్రమంలో అక్షయ్ కుమార్‌తో పని చేసిన ఎక్స్‌పీరియెన్స్ గురించి విష్ణు మంచు తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

అక్షయ్‌కుమార్‌ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైంది. ఇంకా ఇలా ఎన్నోసార్లు కలవాలని కోరుకుంటున్నాను” అని అన్నారు. మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసి ప్రమోషన్ కార్యక్రమాలను పెంచనున్నారు.

Share this post

scroll to top