పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే : సీఎం జగన్

jagan3.jpg

పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే.. కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టేనని సీఎం జగన్ పేర్కొన్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరో 9 రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరుగబోతుంది. వైసీపీకి ఓటు వేస్తేనే పథకాలు అన్ని కొనసాగుతాయి. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల ఇంటింటి భవిష్యత్ ను నిర్ణయిస్తాయని తెలిపారు.

రాష్ట్రంలో ఎప్పుడు చూడనివిధంగా మానిఫెస్టో లో చెప్పినవి ఏకంగా 99 శాతం అమలు చేశామని తెలిపారు. ఈ ఐదేళ్లలో 2లక్షల 31వేల ఉద్యోగాలిచ్చామని తెలిపారు. ఇప్పుడు మీ బిడ్డ చెబుతున్న పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా..? గతంలో ఎప్పుడైనా చూశామా..? గతంలో ఎప్పుడూ చూడని విధంగా విద్యాదీవెన, వసతి దీవెన, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31లక్షల ఇండ్ల పట్టాలు వంటివి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టామని తెలిపారు.

Share this post

scroll to top