ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

jagan2.jpg

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సీఎం జగన్ తాాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాల విమర్శలపై సీఎం జగన్ స్పష్టత ఇచ్చారు. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటో చంద్రబాబుకు తెలుసా..? అని ప్రశ్నించారు సీఎం జగన్.

భూములపై రైతులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ఈ చట్టం యొక్క ఉద్దేశం అన్నారు. ప్రజలకు ఫోన్లు చేసి జగన్ భూములు లాక్కుంటారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భవిష్యత్ లో ఇది పెద్ద సంస్కరణ అవుతుంది. తమ భూముల కోసం రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్య లేకుండా భూములకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడమే ఈ చట్టం అని స్పష్టం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు తో పాటు కూటమి నేతలంతా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అలా చేయడం సరికాదన్నారు సీఎం జగన్.

Share this post

scroll to top