Tag Archives: chandrababu

చంద్రబాబుకు నాపై కోపం : సీఎం జగన్

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెపథ్యంలో సీఎం జగన్ మాట్లడుతూ చంద్రబాబు తనకు శాపనార్థాలు పెడుతున్నారని..చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువగా వస్తోంది. హై బీపీ వస్తోంది. ఏవేవో తిడుతూ శాపనార్థాలు పెడుతుంటాడు. నాకేదో అయిపోవాలని కోరుకుంటాడు. రాళ్లు వేయండి, అంతం చేయండి అని పిలుపునిస్తూ ఉంటాడు. బాబుకు ఓటేస్తే పథకాలన్నీ ఆగిపోతాయి. చంద్రబాబు పేరు చెబితే వెన్నుపోటు, కుట్రలు, మోసాలు గుర్తుకువస్తాయి అని విమర్శించారు.

Read More »

బందిపోటు రాజకీయమే చంద్ర‌బాబు పాలన మార్క్!

అయ్యా చంద్రబాబూ.. నీ 14 ఏళ్ల అమోఘమైన పరిపాలన రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీతోపాటు నీ ముఠాలో ఉన్న ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, టీవీ5 నాయుడు ఇలా అందరూ ఈ రాష్ట్రాన్ని ఏవిధంగా దోచుకున్నారో.. రాష్ట్ర భవిష్యత్తును ఎంత నాశనం చేశారో ప్రజలంతా చూశారు. పెత్తందార్ల ముఠాకు చంద్రబాబు నాయకుడనేది ప్రజలందరికీ తెలిసిపోయింది అని సీదిరి అప్పలరాజు అభివ‌ర్ణించారు.చంద్రబాబు తొత్తుగా ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఏదేదో మాట్లాడాడు. ...

Read More »

చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్..?

గుడివాడ ‘మేమంతా సిద్ధం’ సభలో కొడాలి నాని మాట్లాడుతూ… సీఎం జగన్‌ పాలనతోనే సంక్షేమం సాధ్యమైందన్నారు. అంతేకాకుండా,వాలంటీర్‌ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారన్నారు. పిల్లల భవిష్యత్‌ కోసం ఆలోచించిన నాయకుడు సీఎం జగన్ అని కొనియాడారు కొడాలి నాని. ఆరోగ్య శ్రీ ద్వారా ఎంతోమందిని సీఎం జగన్ ఆదుకున్నారన్నారు. చంద్రబాబుది మాయా కూటమని ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌ను ఎదుర్కోలేక కుట్రలు చేశాడని మండిపడ్డారు. దేవుడు, ప్రజల ఆశీస్సులే సీఎం జగన్‌ను కాపాడాయన్నారు.

Read More »

జగన్‌ను హతమార్చాలని చంద్రబాబు కుట్ర-మంత్రి అంబటి

విజయవాడలో కుట్ర ప్రకారంగానే సీఎం జగన్‌పై దాడి జరిగిందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. సోమవారం రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై జరిగిన దాడిని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించారని అన్నారు. వైసీపీని రాజకీయంగా ఎదుర్కోలేకనే దాడులకు దిగుతున్నారని విమర్శించారు. జగన్‌ను హతమార్చాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. జగన్‌కు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరు అని అన్నారు. ముగ్గురూ కలిసి ఓడించడం కష్టమని భావించి హతమార్చాలనే కుట్ర చేశారని ...

Read More »

చంద్రబాబును మించిన ఊసరవెల్లి షర్మిల -కొండా రాఘవరెడ్డి

చంద్రబాబును మించిన ఊసరవెల్లి షర్మిల.. అంటూ వైఎస్సార్టీపీ ఫౌండర్ కొండా రాఘవరెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు లాంటి రాక్షసులతో చేతులు కలిపిందని.. ఆయన లాంటి విషసర్పాలకు పాలుపోస్తావా? అంటూ నిలదీశారు. వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊరుకోబోమని.. తెలంగాణలో కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసగించిందని షర్మిలపై నిప్పులు చెరిగారు వైఎస్సార్టీపీ ఫౌండర్ కొండా రాఘవరెడ్డి. ఇప్పుడు ఇక్కడికొచ్చి రాజకీయం చేస్తోందన్నారు. షర్మిల ఎన్నికుట్రలు చేసినా… ఎవరూ పట్టించుకోరని.. వైసీపీ విజయం సాధిస్తుందన్నారు వైఎస్సార్టీపీ ఫౌండర్ కొండా రాఘవరెడ్డి.

Read More »

మీ ఆగ్రహం.. ధర్మాగ్రహం కావాలి: చంద్రబాబు

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా రెండు రాష్ట్రాల ప్రజలకు వెరైటీ విషెస్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! ఈ ఎన్నికల సమయంలో మనందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. క్రోధి అంటే కోపంతో ఉన్నవారు అని అర్థం. అయితే నేడు మీ ఆగ్రహం…ధర్మాగ్రహం కావాలి. ఆ ఆగ్రహంలో చెడు అంతా దహనమై….ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే చల్లని పాలన మొదలవ్వాలని ...

Read More »

చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ ట్వీట్

ఏపీ సీఎం జగన్ ఇవాళ తిరుపతి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన చిన్న సింగమలలో ఆటో, టిప్పర్ డ్రైవర్లతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన అనంతపురం జిల్లా శింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్ చదివాడని, చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోవడంతో టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని సీఎం జగన్ వెల్లడించారు. ఒక సాధారణ టిప్పర్ డ్రైవర్ ను చట్టసభకు పంపించేందుకు తాము టికెట్ ఇచ్చామని, దీనిపై టీడీపీ ...

Read More »

టీడీపీ వల్లే పెన్షన్లు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందన్న విజయసాయిరెడ్డి

ఎన్నికల వేళ ఏపీలో పెన్షన్ల అంశం హాట్ టాపిక్ గా మారింది. వాలంటీర్లతో పెన్షన్లను పంపిణీ చేయించరాదని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు, టీడీపీ పెన్షన్లను ఆపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై ఎక్స్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పందిస్తూ… టీడీపీ వల్లే ఏపీలో 66.34 లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడంలో ఆలస్యం జరిగిందని విమర్శించారు. ఇది టీడీపీ నేతల మెంటాల్టీకి నిదర్శనమని చెప్పారు. తన బినామీలకు, ల్యాండ్ మాఫియా స్నేహితులకు చెల్లింపులు చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబు ...

Read More »

ప్రతిపక్షాలకి ఎమ్మెల్యే కొడాలి నాని కౌంటర్..!

అభిమానులు తన కాళ్లకు పాలాభిషేకం చేయడం ప్రజలు నిరదీశారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతానికి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కొడాలి నాని. నన్ను నిలదీశారంటూ వస్తున్న పకోడీ వార్తలను పట్టించుకోనని చెప్పారు. గుడివాడలో నన్ను రాష్ట్రంలో సీఎం జగన్ ని ఎవ్వరూ ఓడించలేరు అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నాం. మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించాను. అయినా తనపై అభిమానంతో ఒకటి రెండు చోట్ల వద్దని చెప్పిన నా కాళ్లు కడిగారు అని ...

Read More »

చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి: వైఎస్ అవినాశ్ రెడ్డి

అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా టీడీపీ అధినేత చంద్రబాబు అడ్డుపడ్డారని కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి విమర్శించారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్నారని అన్నారు. మండుటెండల్లో పెన్షన్ల కోసం వెళ్లిన పలువురు మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబును ప్రజలు సస్పెండ్ చేయాలని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే నేతలు మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కూటమి పేరుతో ఇతర పార్టీలను కూడగట్టుకుని చంద్రబాబు వస్తున్నారని అవినాశ్ అన్నారు. రంగురంగుల మేనిఫెస్టోతో ఇప్పుడు ఎన్నికలకు ...

Read More »