రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తున్న మూవీ…

Marco-.jpg

మలయాళ నటుడు ముకుందన్ తాజా చిత్రం ‘మార్కో’. ‘మైఖేల్, ది గ్రేట్ ఫాదర్’ వంటి మూవీస్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ హనీఫ్ అదేని ఈ చిత్నాన్ని తెరకెక్కిస్తున్నాడు. హై బడ్జెట్‌తో యాక్షన్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అంతే కాకుండా ఇందులో నుంచి ఇప్పటికే రిలీజైనా ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. తాజాగా విడుదలైన హీరో ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సోషల మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. ఇందులో ముకుందన్ సిగరెట్ పట్టుకుని యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నాడు.

ఈ క్రమంలోనే మూవీపై భారీ అంచనాలు నెలకొనగా.. రిలీజ్‌కు ముందే ‘మార్కో’ కొత్త రికార్డును సృష్టించింది. ఈ మేరకు తాజాగా సినిమాకు సంబంధించిన బాలీవుడ్ రైట్స్‌పై ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌లో ‘మార్కో’ భారీ ధ‌రకు అమ్ముడైన‌ట్లు చిత్రబృందం ప్రక‌టించింది. ఈ సినిమా హిందీ హక్కుల‌ను రూ.5 కోట్లకు ద‌క్కించుకున్నట్లు ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా.. క్యూబ్స్ ఎంటర్‌టైనర్ బ్యాన‌ర్‌పై షరీఫ్ మహ్మద్ అబ్దుల్ గదాఫ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.

Share this post

scroll to top