పుష్ప సినిమా నా కెరీర్‌కు ఉపయోగపడలేదు..

Pushpaaa.jpg

నటుడు ఫహాద్ ఫాజిల్ అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో విలన్‌గా చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఇందులో ఎస్‌పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో కనిపించి అదరగొట్టేశాడు. తెలుగులో పుష్ప ఒక్క సినిమాతోనే ఆయన ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫహాద్ పుష్ప వల్ల తనకు ఎలాంటి లాభం లేదని షాకింగ్ కామెంట్స్ చేశాడు.

పుష్ప సినిమా నా కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. అలాగే నేను కూడా ఎలాంటి లాభాన్ని పొందలేదు. ఈ విషయాన్ని నేను పుష్ప డైరెక్టర్ సుకుమార్ ముందు కూడా చెప్పాను. అది నేను దాచాల్సిన పని లేదు. అబద్ధం కూడా చెప్పడం లేదు. ఆ సినిమా తర్వాత తెలుగులో కంటే ఎక్కువ మలయాళ చిత్రాల్లోనే నటించాను.

కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే.. మలయాళ భాష తెలియని వారు కూడా నా సినిమాలు చూస్తున్నారు. అదొక్క విషయం నాకు సంతోషాన్ని కలిగిస్తుంది. నేను నా సినిమాల వల్ల ఎవరినీ ఏ ప్రాంతాన్ని అగౌరవ పరచడం లేదు. అలాంటి ఉద్దేశం కూడా లేదు. నాకు ఎలాంటి ఫేమ్ రాలేదు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫహాద్ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Share this post

scroll to top