అలా చేయడంతో అక్కినేని హీరోను ఆడేసుకుంటున్న నెటిజన్లు..

Sushanthhh.jpg

అక్కినేని నాగార్జున మేనల్లుడిగా సుశాంత్ ‘కాళిదాసు’ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆ తర్వాత పలు అడ్డా, కరెంట్, అలా వైకుంఠపురం లో, చిలసౌ, భోళా శంకర్ వంటి సినిమాలతో మెప్పించాడు. ఇటీవల సుశాంత్ రవితేజ రావనాసుర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా థియేటర్స్‌లో విడుదలై మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సుశాంత్ ఆ తర్వాత ఏ కొత్త సినిమా ప్రకటించనప్పటికీ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో నెట్టింట రచ్చ చేస్తున్నాడు.

తాజాగా, సుశాంత్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన పోస్ట్ దుమారం రేపింది. ఓ ఫొటో షేర్ చేసి క్యాప్షన్ పెట్టలేదు పర్లేదు కదా? అని రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన ఓ నెటిజన్ ఫొటో పెట్టకపోయినా పర్లేదు అని కౌంటర్ వేశాడు. ఇక సుశాంత్ కోపంతో అతడిని బ్లాక్‌లో పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్టులు వైరల్ అవుతుండటంతో అది చూసిన వారంతా సుశాంత్‌ను ట్రోల్ చేస్తూ ఆడేసుకుంటున్నారు. దీంతో అక్కినేని కూల్ అయిపోయి.. ఏంటి బ్రో అంత మాట అనేశావ్ అని పోస్ట్ పెట్టాడు. అయినప్పటికీ నెటిజన్లు ట్రోల్ చేస్తూనే ఉన్నారు.

Share this post

scroll to top