బరువు తగ్గాలనుకునే వారికే కాదు.. సాధారణ వ్యక్తులు కూడా గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యంగా కనిపిస్తారు. పొట్టలోని కొవ్వును కరిగించడంలో గ్రీన్ టీ హితోధికంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది జీవక్రియను పెంచుతుంది. కడుపు అనారోగ్యకరంగా ఉంటే పలు రకాల వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. అయితే గ్రీన్ టీ తాగడం ద్వారా కడుపు ఎప్పటి కప్పుడు శుభ్రంగా మారడం వల్ల, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
వేసవిలో వేడి నుండి ఉపశమనం పొందడానికి గ్రీన్ టీ మంచి ఎంపిక. వాస్తవానికి, వేసవిలో మన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీని కారణంగా డీహైడ్రేషన్ కూడా సంభవిస్తుంది. దీని వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, హైడ్రేట్ గా ఉంచడం సాధ్యమవుతుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకోవచ్చు.