‘గేమ్ ఛేంజర్’ నుంచి షాకింగ్ అప్‌డేట్!

Game-chngrrrrrrrrrrrrr.jpg

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్‌గా నిర్మిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఎంతో ఆకట్టుకోగా.. మూవీపై ఫ్యాన్స్‌లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతో ఈ చిత్రం తెరపై ఎప్పుడెప్పుడూ చూస్తామా అని చాలా ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్.

నిజానికి ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకోచ్చేందుకు సన్నాహాలు జరగ్గా.. ఇప్పుడు ఆ టేడ్ వాయిదా పడినట్లు సమాచారం. దీనికి కారణం లేకపోలేదు. ‘గేమ్ ఛేంజర్’ సినిమాను తెరకెక్కిస్తున్న శంకర్.. దీంతో పాటు కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ కూడా డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘ఇండియన్ 2’ పై తన పూర్తి ఫోకస్ పెట్టాడట డైరెక్టర్. దీంతో ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్‌కు మధ్యమధ్యలో బ్రేక్‌లు ఇస్తూ లేట్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో గట్టిగా వాదనలు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ మూవీ కోసం ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు దీనిపై క్లారిటీ రావాలంటే.. రిలీజ్‌పై మూవీ టీం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

Share this post

scroll to top