నన్ను అరెస్ట్ చేయాలని మోదీ చూస్తున్నారు : కేసీఆర్

kcr-2.jpg

ప్రధాని మోదీ తనను కూడా జైలుకు పంపేందుకు ప్రయత్నించారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మోదీకి లొంగని వ్యక్తుల్లో తాను, కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ఉన్నామని, వారిద్దరినీ అనుకున్నట్టే జైలుకు పంపినా తనెక్కడా అవినీతికి పాల్పడకపోబట్టే మోదీకి తాను దొరకలేదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో నిన్న ప్రచారం నిర్వహించిన కేసీఆర్ ఈనాడు-ఈటీవికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కేసు అనేది మోదీ వికృత రూపానికి నిదర్శనమని దుయ్యబట్టారు. మద్యం పాలసీలో కుంభకోణాన్ని సృష్టించి అందులో కవితను ఇరికించారని ఆరోపించారు.

పదేళ్ల తమ పాలనలో అద్భుతాలు చేశామన్న ఐదు నెలల పాలనలోనే ప్రజల్ని రాచి రంపాన పెడుతోందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో తప్పకుండా ప్రభావం కనిపిస్తుందని, బీఆర్ఎస్ గణనీయమైన సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని, పార్లమెంటు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అనిశ్చితి ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు.

Share this post

scroll to top