దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. బుధవారం శ్రీవారిని దర్శనానికి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి ఖచ్చితంగా 17 నుంచి 18 గంటల సమయం పడుతోంది.
ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఆళ్వార్ ట్యాంక్ అతిధి గృహం వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతోంది. బుధవారం స్వామి వారిని 81,930 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 41,224 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.90 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.