రేవంత్ రెడ్డిని కలిసిన మ్యూజిక్ డైరెక్టర్..

revanthh-1.jpg

ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటతో ఎంఎం కీరవాణి తెలుగు ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటిన విషయం తెలిసిందే. ఈ పాటకు ఆస్కార్ అవార్డు సైతం దక్కింది. కాగా, సీఎం రేవంత్ రెడ్డితో మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి నేడు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయజయహే తెలంగాణ పాటను కీరవాణితో పాడించే అంశంపై వీరు చర్చించారు. ఈ భేటీలో రచయిత అందెశ్రీ సైతం పాల్గొన్నారు. అయితే 9 డిసెంబర్ 2009 తర్వాత ఈ పాట కోట్లాది మందికి చేరింది. ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రరకటిస్తామని గత ప్రభుత్వం చెప్పినా విస్మరించడంతో ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటించింది.

Share this post

scroll to top