జగనన్న విద్యా దీవెన, ఆస‌రా నిధులు విడుద‌ల‌

vidhyadevena-.jpg

డీబీటీ పథకాలకు నిధుల విడుదలకు ఎన్నిక‌ల సంఘం (ఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నిన్న (బుధ‌వారం) ఒక్కరోజే ఆసరాకు రూ.1480 కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద రూ.502 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయవచ్చని ఈసీ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు ఫథకాల లబ్ధిదారులకు నిధులు మంజూరు చేశారు. మిగిలిన పథకలకు నిధులు విడుదల చేసేందుకు సిద్దంగా ఉంది ప్రభుత్వం. కాగా, గతంలో టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్‎కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా నిలిపివేశారు.

మే 13న పోలింగ్ ముగిసిన తరువాత నిధుల విడుదలకు ఈసీ ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈసీ ఆదేశాల మేరకు మే 15న ఆసరా, జగనన్న విద్యా దీవెన, సంపూర్ణ ఫీజు రీఎంబర్స్‎మెంట్ కింద రూ. 1982 కోట్ల రూపాయలు నగదు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసింది. మిగిలిన పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు కూడా రెండు, మూడు రోజుల్లో డీబీటీ విధానం ద్వారా నిధులు విడుదల చేస్తామని సీఎస్ తెలిపారు. దీంతో విద్యార్థులు, మహిళలు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు.

Share this post

scroll to top