ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దుష్ప్రచారం పై సీఐడీ దర్యాప్తు

Chnadra-babuuuu.jpg

చంద్రబాబు, లోకేష్‎లకు మరోసారి నోటీసులు? ల్యాండ్ టైటిలింగ్ చట్టం దుష్ప్రచారం కేసులో సీఐడీ విచారణ కొనసాగుతోంది. చంద్రబాబు, లోకేష్‎లకు సీఐడీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఎన్నికల వేళ ప్రతి ఒక్కరి నోటా ఇదే చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ సీఎం జగన్‎పై దుష్ప్రచారం చేశారు. ఏపీలో భూములు అన్ని సీఎం జగన్ లాక్కుంటారని అసత్య ప్రచారాలు చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు, లీగల్ సెల్ అధ్యక్షులు పూర్తి సాక్ష్యాధారాలతో ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఈసీ చర్యలు చేపట్టాలని ఏపీ సీఐడీకి ఆదేశించింది. ఈసీ ఆదేశాలతో రంగంలో దిగిన సీఐడీ అధికారులు కేసు దర్యాప్తులో వేగం పెంచారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారంలో ఎవరెవరు భాగస్వామ్యమయ్యారో వారిపై కేసులు నమోదు చేశారు.

Share this post

scroll to top