ఎండలకు తాళలేకపోతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. భానుడు భగభగమంటూ మండుతూ నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 7 తర్వాత ప్రజలు ఇంటి నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. తీవ్రమైన వేడి, వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.