ప్రధాని మోడీపై వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో రాజమండ్రిలోని వేమగిరిలో నిర్వహించిన సభలో మోడీ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంగళవారం బొత్స మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై మాట్లాడకుండా మోడీ పరార్ అయ్యారని ఎద్దేవా చేశారు. విశాఖ రైల్వేజోన్‌పై కూడా ఆయన అవగాహన లేకుండా మాట్లాడారని ధ్వజమెత్తారు. రాజమండ్రి సభలో ప్రధాని మోడీ టీడీపీ తయారు చేసిన స్క్రిప్ట్‌ను చదివారని సెటైర్ వేశారు. తప్పుడు, అబద్ధపు మాటలతో మోడీ ప్రధాని పదవికి విలువ లేకుండా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇక, జూన్ 4న ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందన్న మోడీ కామెంట్స్‌కు సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేది ఆంధ్రప్రదేశ్‌లో కాదని.. బంగాళాఖాతంలో ఆ కూటమి పవర్‌లోకి వస్తుందని ఎద్దేవా చేశారు. ఈ సారి కేంద్రంలో మా పార్టీపై ఆధారపడే ప్రభుత్వం రావాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- Home
- News
- Andhra Pradesh
- ప్రధానిపై వైసీపీ మంత్రి హాట్ కామెంట్స్..