భట్టి విక్రమార్క ఇంట్లో చోరీ..

batti-27.jpg

రాష్ట్రంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ లోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంలో చోరీ జరిగింది. ఇంట్లో నగదు, బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించిన విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజులను పరిశీలించి నిందితులు బిహార్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ప్రస్తుతం భట్టి విక్రమార్క విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు వెంటనే భట్టికి సమాచారం ఇచ్చారు. అయితే ఆయన వెంటనే పోలీస్‌ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం.

Share this post

scroll to top