అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఈ సందర్భంగా తన విజయం ఖాయమైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు నన్ను యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఎవరూ ఊహించలేని విధంగా ఫలితాలు ఉన్నాయని అన్నారు. తనపై నమ్మకం ఉంచినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అధ్యక్ష ఫలితాలను ట్రంప్ స్పందించారు.
అమెరికా ఉపాధ్యక్షుడిగా జే.డీ.వాన్స్ అంటూ ప్రకటించేశారు. రిపబ్లిక్ పార్టీ విజయం పూర్తయిన తరువాత ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేయనున్నారు. ఆయన ఏపీలోని నిడదవోలు నియోజకవర్గం వడ్లూరుకు చెందిన ఉషా చిలుకూరి భర్తనే జే.డీ.వాన్స్ దీంతో తెలుగింటి అల్లుడు అమెరికా ఉపాధ్యక్షుడు అయ్యారు. విజయోత్సవ ప్రసంగంలో ట్రంప్ వాన్స్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇది తెలుగు వారికి గర్వకారణమని ఆ గ్రామస్తులు పేర్కొంటున్నారు. అలాగే తన విజయంలో మెలానియా కీలక పాత్ర పోషించారని ట్రంప్ చెప్పారు.