తెలంగాణ రాజకీయ హస్తినకు చేరింది. ఇప్పటికే బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఢిల్లీలో ఉండగా ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ పయనమవుతున్నారు. మంగళవారం రేవంత్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. దీంతో ఢిల్లీలో అసలేం జరగబోతోందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ కారణంగానే తెలంగాణ పాలిటిక్స్ ఔట్ ఆఫ్ స్టేషన్‌గా మారాయి. మూడు పార్టీల ముఖ్య నేతలు రాష్ట్ర పాలిటిక్స్‌పై రాష్ట్రం దాటి విమర్శలు చేసుకోవడం హాట్‌టాపిక్‌గా మారాయి. ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌పై కేటీఆర్ కంప్లైంట్ చేస్తే మహారాష్ట్ర ప్రచారంలో కిషన్‌రెడ్డి కాంగ్రెస్ పై కౌంటర్స్‌కి రెడీ అయ్యారు. ఇదే తరుణంలో మరోసారి సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది.