సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో నిర్బంధ కాండ కొనసా గుతున్నది. ప్రజాపాలనతో పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచి వేస్తున్నది. ఫార్మా కంపెనీల కోసం భూముల సేకరణపై వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం లగచర్లలో ప్రభుత్వం సోమవారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ రణరంగంగా మారింది. కాంగ్రెస్ సర్కార్ మొండిపట్టుతో సహనం నశించిన కర్షకులు కన్నెర్రజేశారు. తమ భూములు గుంజుకునే ప్రయత్నాలపై కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తిరగబడ్డారు. ఏకంగా కలెక్టర్, అదనపు కలెక్టర్ సహా ఇతర అధికారులపైకి దండెత్తి దొరికినోళ్లను దొరికినట్టు తరిమికొట్టారు. కడా స్పెషల్ ఆఫీసర్, పరిగి డీఎస్పీని చుట్టుముట్టి మరీ చితకబాదారు. దీంతో అర్ధరాత్రి నుంచే పోలీసు బలగాలు భారీ ఎత్తున లగచర్లను చుట్టుముట్టాయి. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటూ చేస్తూ ఎవరిని అనుతించడం లేదు.
కొడంగల్ కు వెళ్లనున్న బీఆర్ఎస్ నేతలు..
