పట్నం నరేందర్ రెడ్డి అరెస్టుపై కేటీఆర్ ఫైర్..

narandra-13-.jpg

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌కు ఆపాదించే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో సెన్సేషనల్ పోస్ట్ చేశారు. కార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం అంటూ కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్ ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు ప్రభుత్వం లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగిందని ఆరోపించారు. ‘పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్‌లు తప్పవని బెదిరిస్తున్నారు.

ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్ట్ లతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుంది. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్ట్ లు ఎన్నో చూసింది. ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నా. వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలి.’’ అంటూ తన పోస్ట్ ద్వారా డిమాండ్ చేశారు.

Share this post

scroll to top