అదృష్టాన్ని పరీక్షించుకోనున్న మౌని రాయ్..

mouni-roy-16.jpg

మూవీ ఆడియన్స్‌కు పెద్దగా పరిచయం లేకపోయినా బుల్లితెర ప్రేక్షకులకు ఫెమిలియర్ పేరు మౌనీరామ్‌. హర హర మహాదేవ సీరియస్‌లో సతీ దేవిగా కనిపించిన మౌనీ ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అందుకోసం సోషల్ మీడియా మీద కూడా గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు మౌనీ రాయ్‌. బ్రహ్మాస్త్ర సినిమాలో చేసిన జునూన్‌ పాత్రతో తెలుగు ఆడియన్స్‌కు కూడా దగ్గరయ్యారు మౌనీ రాయ్‌. అప్పటి వరకు హర హర మహాదేవలో సతీదేవిగానే తెలిసిన ఈ బ్యూటీ ఒక్కసారి నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించటంతో సౌత్ ఆడియన్స్‌ కూడా ఈ బ్యూటీ మీద ఫోకస్ పెట్టారు.

బిగ్‌ స్క్రీన్ మీద బిగ్ హోప్స్ పెట్టుకున్న మౌనీరాయ్‌ క్యారెక్టర్‌ రోల్స్‌ నుంచి ఐటమ్ సాంగ్స్‌ వరకు ఏ ఛాన్స్ వచ్చినా నో అనకుండా కమిట్ అవుతున్నారు. రీసెంట్‌గా వేద మూవీలో ఈ బ్యూటీ చేసిన స్పెషల్‌ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రజెంట్ బాలీవుడ్‌లో ది వర్జిన్‌ ట్రీ అనే బోల్డ్ మూవీ చేస్తున్న ఈ బ్యూటీ అప్పుడప్పుడు మ్యూజిక్ వీడియోస్‌తోనూ హల్‌చల్ చేస్తున్నారు. అదే సమయంలో తనకు ఈ స్థాయి తీసుకు వచ్చిన బుల్లితెరను కూడా వదిలిపెట్టుకుండా స్మాల్‌ స్క్రీన్ జర్నీ కూడా కంటిన్యూ చేస్తున్నారు.

Share this post

scroll to top